శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 29, 2020 , 15:13:42

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య

రాజన్నసిరిసిల్ల : తల్లి మందలించిందన్న మనోవేదనతో యువకుడు వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. తంగెళ్లపల్లికి చెందిన బొప్పన సాయికుమార్‌ (18)ను ఓ విషయంలో తల్లి మందలించడంతో ఈ నెల 26 ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నాటి నుంచి వెతుకుతున్నా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. శనివారం ఉదయం గ్రామశివారులోని వ్యవసాయబావిలో స్థానికులు సాయికుమార్‌ మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయికుమార్‌ మృతితో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo