Samantha | తెచ్చిన తంటామనకు పెద్దగా కనిపించని విషయం.. పక్కవాళ్లకు భూతద్దంలో కనిపించవచ్చు. అందుకే మన చర్యల పరిణామాలను ముందుగా పసిగట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఈ విషయంలో కొందరు సినీ సెలబ్రిటీలు వీక్. తొందరపడి పోస్టులు పెట్టేయడం, తర్వాత నాలిక కరుచుకోవడం. చాలామంది విషయంలో ఇది పరిపాటైపోయింది. నిరంతరం వార్తలో ఉండే స్టార్ హీరోయిన్ సమంత.. టవల్ కట్టుకొని ఇన్ఫ్రారెడ్ ఆవిరి బాత్ చేస్తున్న పిక్ ఒకటి తాజాగా పోస్టు చేసింది. ఆ పోస్ట్‌లో ఈ బాత్ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా రాసింది. ఏమనుకుందో ఏమో.. అంతలోనే పోస్ట్‌ను డిలీట్ చేసేసింది.
అయితే ఈ కొద్ది సమయంలోనే ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. కొందరు ఆకతాయిలైతే సమంత పోస్ట్ చేసిన పిక్‌ను మార్ఫింగ్ చేసి, ఇబ్బందికరంగా చూపిస్తూ వైరల్ చేశారు. సామ్ అభిమానులేమో ఒరిజినల్ పిక్‌ను వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా మొత్తంగా బూమరాంగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో సమంత పరోక్షంగా స్పందిస్తూ.. ‘మిమ్మల్ని మీరు సమర్ధించుకోవాల్సిన అవసరం లేకుండా.. నిరూపించుకోవాల్సిన అవసరం రాకుండా జీవించడమే నిజమైన విజయం’ అనే కొటేషన్‌ని పోస్ట్ చేసింది. ఈ పిక్‌పై జరుగుతున్న రాద్ధాంతానికి పుల్‌స్టాప్ పెట్టడానికే సామ్ ఈ క్యాప్షన్ షేర్ చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.