ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jun 24, 2020 , 17:03:12

న్యూస్ పేప‌ర్లో మ‌హిళ కాళ్లు.. చెట్ల పొద‌ల్లో పిండం..

న్యూస్ పేప‌ర్లో మ‌హిళ కాళ్లు.. చెట్ల పొద‌ల్లో పిండం..

ఛండీగ‌ర్ : ఆమె గ‌ర్భిణి.. ఏమైందో తెలియ‌దు కాని.. అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. ఆ త‌ర్వాత శ‌రీర భాగాల‌ను ముక్క‌లు ముక్క‌లుగా చేసి న్యూస్ పేప‌ర్లో చుట్టారు. పిండాన్ని చెట్ల పొద‌ల్లో పడేశారు. ఈ అమానుష ఘ‌ట‌న ఛండీగ‌ర్ లోని సెక్టార్ 17లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భ‌వ‌నానికి స‌మీపంలో మంగ‌ళ‌వారం వెలుగు చూసింది.  

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం బ్యాంకు ఉద్యోగి.. లంచ్ కోస‌మ‌ని సైకిల్ పై త‌న ఇంటికి వెళ్తున్నాడు. బ్యాంకు బిల్డింగ్ స‌మీపంలో.. ఓ మ‌హిళ కాళ్లు, ఇత‌ర శ‌రీర భాగాలు న్యూస్ పేప‌ర్లో చుట్టి ఉన్నాయి. ఆ ప‌క్క‌నే ఉన్న చెట్ల పొద‌ల్లో పిండం కూడా ఉంది. దీన్ని గ‌మ‌నించిన బ్యాంకు ఉద్యోగి.. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. 

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మ‌హిళ శ‌రీర భాగాల‌ను, పిండాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గ‌వ‌ర్న‌మెంట్ మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే శ‌రీర భాగాలు కుళ్లిపోక‌పోవ‌డంతో.. ఇటీవ‌లే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. స‌మీప ప్రాంతాల‌కు చెందిన మ‌హిళ‌నే అయి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.  కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo