జహీరాబాద్/సంగారెడ్డి : ముంబైకి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ పట్టణ సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం..ఆదివారం జహీరాబాద్ పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని ముంబైకి తరలిస్తుండగా కారును సీజ్ చేసి గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీకి చెందిన కిషన్ రావు తన కారులో 74 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న పోలీసులకు రివార్డు కోసం జిల్లా ఎస్పీకి ప్రతిపాదనలు పంపిస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కాబూల్‌లోని అమెరికా ఎంబసీలో కీలక పత్రాలు ధ్వంసం
భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
Heart Attack : సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన