భార్య, కూతురిపై దాడి..కేసు నమోదు
భార్య కూతురిపై దాడి | భార్యతో పాటు కూతురిపై దాడికి పాల్పడడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బంజారాహిల్స్,ఆగస్టు 15 : భార్యతో పాటు కూతురిపై దాడికి పాల్పడడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని సింగాడకుంటలో నివాసం ఉంటున్న మహ్మద్ యూసుఫ్, అమీషా యూసుఫ్‌లకు గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఇంటికి సంబందించిన అద్దెలు మొత్తం యూసుఫ్ వసూలు చేసుకోవడంతో పాటు జల్సాలకు ఖర్చు చేస్తుంటారని, ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలను పట్టించుకోవడం లేదని తరచూ భార్య అమీషా గొడవ పడుతుంటుంది.
ఈ నేపథ్యంలో శనివారం ఇంటికి వచ్చిన తండ్రి యూసుఫ్ తన తల్లితో పాటు సోదరిపై విచక్షణారహితంగా దాడి చేశారని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ పెద్ద కూతురు రితూ యూసుఫ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తమను వేధింపులకు గురిచేయడంతో పాటు ఇంటి అద్దెల గురించి అడిగితే తల్లీ కూతుళ్లను రేప్ చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు యూసుఫ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

