Heart Attack : సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స : ఆస్ట్రేలియా పరిశోధన
Heart Attack : గుండెపోటు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టమే. ఒక్కసారి వచ్చిందంటే మరణాన్ని జయించడం కొంచెం కష్టమే అంటున్నారు వైద్యులు. గుండెపోటుకు సాలీడు విషంతో...

సిడ్నీ : గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోయి మార్గం కుచించుకుపోతుంది. ఫలితంగా గుండెకు రక్తసరఫరా నిలిచిపోయి.. ఆక్సిజన్‌తో పాటు పోషకాలు అందవు. దాంతో కండరాలు చచ్చుబడిపోయి గుండెపోటు (Heart Attack) వస్తుంది. అయితే, గుండెపోటు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టమే. ఒక్కసారి వచ్చిందంటే మరణాన్ని జయించడం కొంచెం కష్టమే అంటున్నారు వైద్యులు. గుండెపోటుకు సాలీడు విషంతో చికిత్స చేసేందుకు ఆస్ట్రేలియా పరిశోధకులు ముందుకొస్తున్నారు.
ఫ్రేజర్ ఐలాండ్ ఫన్నెల్-వెబ్ అనే ప్రమాదకరమైన స్పైడర్ శరీరంలో ఉండే విషంతో గుండెపోటుకు చికిత్స ఇవ్వొచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. వీటిలో లభించే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్.. Hi1a.. దెబ్బతిన్న గుండె కణాలను బాగు చేస్తుందంట. గుండె మార్పిడి చేసుకున్నవారిలో జీవితాన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. గుండె జబ్బు తర్వాత గుండె దెబ్బతినకుండా నిరోధించే అణువులను ఫన్నెల్ బేబ్ స్పైడర్ విషంలో కనుగొన్నట్లు వారు చెప్తున్నారు. ఈ అధ్యయనం ఇటీవల ‘సర్క్యులేషన్’ పత్రికలో ప్రచురించబడింది.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నాథన్ పాల్పంత్, సిడ్నీలోని విక్టర్ చెంగ్ కార్డియాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ గ్లెన్ కింగ్, ప్రొఫెసర్ పీటర్ మెక్‌డోనాల్డ్ ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. సాలీడు విషంలోని Hi1a ప్రోటీన్ నుంచి తయారుచేసే ఔషధ వినియోగాన్ని అత్యవసర పరిస్థితిలో ఉపయోగించడంపై వీరు పరిశోధనలు చేశారు. గుండెపోటు వచ్చిన రోగికి తక్షణ చికిత్స అవసరమవుతుంది. ఇలాంటి సమయాల్లో ఈ ఔషధాన్ని అంబులెన్స్‌లోనే రోగికి అందివ్వొచ్చునని వారు ధీమా ఇస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ ఔషధం ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. గుండెపోటు వచ్చిన తర్వాత గ్రామాల నుంచి పట్టణాల్లోని దవాఖానలకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ ఔషధం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మెదడుకు కూడా మంచిదే..!
సాలీడు విషంలోని Hi1a అనే ప్రోటీన్.. గుండె నుంచి వచ్చే డెత్ సిగ్నళ్లను ఆపడంలో విశేషంగా పనిచేస్తుందని డాక్టర్ నాథన్ చెప్పారు. ఈ ప్రోటీన్.. దెబ్బతిన్న గుండె కణాలను బాగు చేయడంలో కీలకంగా పని చేస్తుందన్నారు. గుండెపోటు తర్వాత వచ్చే నష్టాన్ని నివారించేందుకు ఇచ్చే ఔషధం ఇప్పటివరకు అందుబాటులో లేదని, ఈ ఔషధం మార్కెట్లోకి వస్తే గుండెపోటుతో బాధపడుతున్న లక్షలాది మంది రోగులకు పెద్ద ఉపశమనంగా ఉంటుందని ప్రొఫెసర్ మెక్ డోనాల్డ్ చెప్పారు. Hi1a ప్రోటీన్ సాయంతో దాతల నుంచి తీసుకునే గుండె కణాలు కూడా మెరుగవుతాయని, దీంతో గుండె మార్పిడి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన వెల్లడించారు. బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత కోలుకునేందుకు ఈ ప్రోటీన్ సహాయపడుతుందని ప్రొఫెసర్ గ్లెన్ కింగ్ అన్నారు. స్ట్రోక్‌కు గురైన వ్యక్తికి 8 గంటల తర్వాత కూడా ఈ ప్రోటీన్ ఔషధాన్ని ఇచ్చినప్పుడు మెదడులో జరిగే నష్టాన్ని సరిచేస్తుందని కనుగొన్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలోని హోటల్లో మంటలు.. ఇద్దరు మృతి
ఎన్సీసీ క్యాడెట్ల మనుసు దోచిన మోదీ
ఇండియన్స్‌కు జో బైడెన్ విషెస్
శ్రీనగర్‌లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

