శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Crime - Jul 08, 2020 , 10:47:37

RLD నేత కాల్చివేత‌!

RLD నేత కాల్చివేత‌!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బాగ్‌ప‌ట్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని బ‌ద‌ర్ఖా గ్రామానికి చెందిన రాష్ట్రీయ లోక్ ద‌ల్ (RLD) నాయ‌కుడు దేశ్‌పాల్ ఖోక‌ర్‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్చిచంపారు. మంగ‌ళ‌వారం సాయంత్ర దేశ్‌పాల్ తన ఇటుక‌బ‌ట్టీల ద‌గ్గ‌ర కూర్చుని ఉండ‌గా ముగ్గురు వ్య‌క్తులు బైకుల‌పై వ‌చ్చి అతి స‌మీపం నుంచి కాల్పులు జ‌రిపారు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయారు. 

దుండ‌గుల కాల్పుల్లో దేశ‌పాల్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, హ‌త్య‌కు సంబంధించిన స‌మాచారం అందిన వెంట‌నే ఛాప్రౌలీ పోలీస్‌స్టేష‌న్‌కు చెందిన పోలీసులు ఘ‌టనా ప్రాంతానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo