Heart Attack | డ్రైవింగ్‌లో గుండెపోటు.. 60 మందిని కాపాడి ప్రాణాలు వదిలిన బస్సు డ్రైవర్
Heart Attack | ఒడిశా (Odisha)లో విషాద ఘటన చోటు చేసుకుంది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ (Bus Driver) గుండెపోటు (Heart Attack) బారిన పడ్డాడు.
Heart Attack | ఒడిశా (Odisha)లో విషాద ఘటన చోటు చేసుకుంది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ (Bus Driver) గుండెపోటు (Heart Attack) బారిన పడ్డాడు. అయితే, ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సదరు డ్రైవర్.. చివరికి తుది శ్వాస విడిచాడు.
ఈ ఘటన బాలాసోర్ (Balasore) జిల్లాలోని పటాపూర్ చక్ వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు పశ్చిమబెంగాల్ నుంచి ప్రయాణికులతో బాలాసోర్ జిల్లాలోని పంచలింగేశ్వరాలయం వైపు వెళ్తోంది. అయితే మార్గం మధ్యలో డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి మొదలైంది. దీంతో మరింత దూరం బస్సును నడపలేనని ముందుగానే గ్రహించిన డ్రైవర్.. రోడ్డుపక్కన బస్సును ఆపేశాడు. అనంతరం స్పృహ కోల్పోయి పడిపోయాడు.
ఆ సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను షేక్ అక్తర్‌గా గుర్తించారు. అనంతరం అతడిని నీలగిరి సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Also Read..
Suriya Jyothika | ఫిన్లాండ్ వెకేషన్లో జ్యోతిక – సూర్య దంపతులు.. మంచులో ఆటలు.. క్యూట్ వీడియో
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్లు జైలు శిక్ష
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

