Suriya Jyothika | ఫిన్లాండ్ వెకేషన్లో జ్యోతిక – సూర్య దంపతులు.. మంచులో ఆటలు.. క్యూట్ వీడియో
Suriya Jyothika | కోలీవుడ్ క్యూట్ కపుల్స్ సూర్య (Suriya)- జ్యోతిక (Jyothika) హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ఫిన్లాండ్ (Finland) వెకేషన్‌కు వెళ్లిన ఈ జంట అక్కడి మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
Suriya Jyothika | కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సూర్య (Suriya)- జ్యోతిక (Jyothika) జంట ఒకటి. రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ఈ జంట.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ దంపతులు అయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా వీరు విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను జ్యోతిక కొట్టిపారేశారు. తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట హాలిడేను ఎంజాయ్ చేస్తోంది.
ఇటీవలే ఫిన్లాండ్ (Finland) వెకేషన్‌కు వెళ్లిన జ్యోతిక – సూర్య దంపతులు అక్కడి మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్స్, ప్రొమోషన్స్, ఫ్యామిలీ, పిల్లలు అంటూ తీరిక లేకుండా ఉండే ఈ జంట.. తన బిజీ లైఫ్‌ను పక్కన పెట్టి విలువైన సమయాన్ని సరదాగా గడుపుతున్నారు. గట్టకట్టే చలిలో మంచుతో ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పిల్లలు దియా, దేవ్ లేకుండానే వారు వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన క్యూట్ వీడియోని జ్యోతిక తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ‘ప్రయాణంతో నిండిన ఏడాది 2024..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Also Read..
Mahatma Gandhi | న్యూయార్క్‌లో మహాత్మా గాంధీ నూతన విగ్రహం ఆవిష్కరణ
Amy Jackson | త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న అమీ జాక్సన్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్
Indian student | అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

