IndiGo | గన్నవరం వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు. దీంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.
హైదరాబాద్ నుంచి గన్నవరం (Gannvaram) వెళ్లిన విమానం.. ల్యాండ్ అయ్యేందుకు రన్‌వేపైకి వచ్చింది. అయితే, ఆ సమయంలో విమానం వీల్ తెరుచుకోలేదు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే టేకాఫ్ చేశారు. ఈ ఘటనతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సుమారు 20 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత వీల్ తెరుచుకోవడంతో సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ విమానంలో తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నట్లు సమాచారం.
Also Read..
Imran Khan | సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్లు జైలు శిక్ష
Hemant Soren | సోరెన్ మిస్సింగ్.. ఆచూకీ చెప్తే నగదు రివార్డు.. ప్రకటించిన బీజేపీ నేత
Maldives Tourism | మాల్దీవుల పర్యాటకుల్లో గణనీయంగా పడిపోయిన భారత్ వాటా.. ఎన్నో స్థానానికంటే..?