బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని డంపింగ్ యార్డ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళూరు శివార్లలోని పచ్ఛనడీ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్లో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి యార్డ్ మొత్తానికి విస్తరించాయి. స్థానికులు అగ్నిమాక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.
కాగా, షార్ట్ సర్య్కూట్ కారణంగానే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయని మంగళూరు మేయర్ పరమానంద్ శెట్టి అన్నారు. మంటలు భారీగా ఎగసిపడ్డాయని చెప్పారు. ఈ ప్రమాదంలో షెడ్తోపాటు యంత్రాలు కాలి బూడిదయ్యాయన్నారు. మంటలను సమీపంలోని నివాస సముదాయాలకు వ్యాపించకుండా నిలువరించగలిగామని వెల్లడించారు. దీంతో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
#WATCH | Karnataka: A massive fire broke out at a dumping site in Mangaluru's Pachchanady area, late last night. Fire fighting operations underway. More details awaited. pic.twitter.com/vneF0csd1N
— ANI (@ANI) April 4, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..