శనివారం 16 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 20:03:40

టాటా ఏస్ ఢీకొని వ్య‌క్తికి తీవ్ర‌గాయాలు

టాటా ఏస్ ఢీకొని వ్య‌క్తికి తీవ్ర‌గాయాలు

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలోని సుజాత‌న‌గ‌ర్‌లో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఖమ్మం వైపు నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహ‌నం స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. ఈ క్రమంలో వెనకనుంచి వేగంగా వ‌స్తున్న బైక్ ఒక్క‌సారిగా వాహ‌నాన్ని ఢీకొంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న‌ మాలోతు వినోద్ కుమార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. బాధితుడు ఉప్పరిగూడెం గ్రామా నివాసి. స్థానికులు వెంట‌నే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స‌మాచారం తెలిసిన పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ప్రమాదానికి కారణమైన టాటా ఏసీ వాహనం డ్రైవర్ కొయ్యల రాజును అదుపులోకి తీసుకున్నారు.