నిర్మల్ : జిల్లాలోని కుంటాల మండలం దౌనెల్లి అటవీ శివారు ప్రాంతంలో సోమవారం మేతకు వెళ్లిన ఆవుల మందపై చిరుతపులి దాడి చేసింది. గొల్లమాడ పెద్ద చెరువు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై చిరుతపులి ఒక్కసారిగా దాడి చేయడంతో పశువుల కాపరులు అప్రమత్తమై కేకలు వేశారు.
నిమ్మల సాయన్న అనే రైతుకు చెందిన రెండు ఆవులను చిరుతపులి తీవ్రంగా గాయపరిచింది. పశువుల కాపరుల అరుపులతో చిరుత పొదల్లోకి పారిపోయింది. గాయపడిన పశువులకు పశువైద్యాధికారి ప్రకాశ్ చికిత్స అందజేశారు. చిరుతు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
జయశంకర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. పెండ్లి బృందం వాహనం వెంట పరుగులు
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Telangana | తమిళనాడు బయల్దేరిన సీఎం కేసీఆర్