ముంబై: బాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజింగ్ జోడీల్లో ఒకటి నదీమ్-శ్రవణ్. వీళ్లలో శ్రవణ్ రాథోడ్ పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉంది. కరోనా సోకిన అతన్ని ముంబైలోని హాస్పిటల్లో చేర్చామని, పరిస్థితి విషమంగానే ఉన్నదని అతని తనయుడు, మ్యూజిక్ కంపోజర్ సంజీవ్ రాథోడ్ చెప్పాడు. 66 ఏళ్ల శ్రవణ్ రాథోడ్ ప్రస్తుతం ఎస్ఎల్ రహేజా హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపాడు. శ్రవణ్‌కు దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నాయని, అత్యంత విషమంగా ఉన్న తన తండ్రిని 24 గంటలపాటు వైద్యులు పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పాడు.
శ్రవణ్ రాథోడ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగానే ఉన్నదని అతనికి చికిత్స అందిస్తున్న డాక్టర్ కీర్తి భూషణ్ చెప్పారు. శ్రవణ్ చికిత్స కోసం ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రవణ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించాలని అతని సన్నిహితుడు, పాటల రచయిత సమీర్ కోరాడు. శ్రవణ్‌కు షుగర్ ఉన్నదని, వైరస్ సోకడంతో అతని ఊపరితిత్తులు పూర్తిగా పాడైనట్లు చెప్పాడు.
నదీమ్-శ్రవణ్ జోడీ 90ల్లో ఎన్నో హిట్ సాంగ్స్ కంపోజ్ చేశారు. వీళ్ల మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఆషిఖీ, సాజన్, పర్దే, రాజా హిందుస్తానీ సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. మళ్లీ 2009లో డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వచ్చిన డు నాట్ డిస్టర్బ్ మూవీకి కలిసి పని చేశారు. శ్రవణ్ త్వరగా కోలుకోవాలని నదీమ్ కూడా ఇన్‌స్టాలో ఆకాంక్షించాడు.
ఇవి కూడా చదవండి
IPL 2021: కోహ్లికి మిస్టర్ నాగ్స్ పంచ్‌లు.. ఆర్సీబీ ఫ్లైట్‌లో ఫన్నీ సీన్స్
మార్స్‌పై నాసా హెలికాప్టర్ వెనుక మనోడు
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!
ఏప్రిల్ 30 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
కరోనాతో చెస్ ఆడుతున్నాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం: ఎయిమ్స్ చీఫ్
IPL 2021: వాషింగ్టన్, పడిక్కల్ దశ తిరిగింది.. ప్యూమాతో ఒప్పందం
IPL 2021: 40 ఏళ్ల వయసులో బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను: ధోనీ
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు