కరోనాతో చెస్ ఆడుతున్నాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం: ఎయిమ్స్ చీఫ్

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనాతో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే.. వైరస్ మరో ఎత్తు వేస్తోంది. ఈ ఏడాది చివరిలోపు ఎవరు గెలుస్తారో చూద్దాం అని అన్నారు ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా. న్యూస్18 చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలోపు వైరస్ కాస్త తగ్గుముఖం పడుతుందని, వచ్చే ఏడాది తొలి అర్ధభాగం ముగిసే వరకు మనం కాస్త ఊపిరి పీల్చుకోవచ్చని ఆయన అన్నారు. అయితే ఇది జరగాలంటే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండాలి. కరోనా కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి అని రణ్‌దీప్ స్పష్టం చేశారు.
కొత్త వేరియంట్లపై చాలా వేగంగా పరిశోధనలు జరగాలని ఆయన నొక్కి చెప్పారు. భవిష్యత్తులో ఈ మహమ్మారి ఎలా ప్రవర్తిస్తుందో, మనం దానిని ఎలా ఎదుర్కొంటామో చూడాలి. వ్యాక్సినేషన్ అయినా, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మనం వ్యవహరించే తీరు అయినా, కొత్త యాంటీ వైరల్ డ్రగ్స్ అభివృద్ధి చేయడం అయినా ప్రస్తుతం మనం వైరస్‌తో చెస్ ఆడుతున్నాం. మనం ఒక ఎత్తు వేస్తే అది మరొక ఎత్తు వేస్తోంది అని రణ్‌దీప్ గులేరియా అన్నారు.
నిర్లక్ష్యం, మ్యుటేషన్ల వల్లే..
ప్రజల్లో నిర్లక్ష్యం, వైరస్ కొత్త మ్యుటేషన్లు సెకండ్ వేవ్‌కు కారణమయ్యాయని ఆయన చెప్పారు. జనవరి, ఫిబ్రవరిల్లో కేసులు తగ్గాయి. వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఇక వైరస్ లేదని అంతా భావించారు. కానీ వైరస్ ఎక్కడికీ వెళ్లలేదు. అది మార్పు చెందుతూ మరింత ముదిరింది అని గులేరియా తెలిపారు. మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోలేదు అని ఆయన అన్నారు. 1989-90 సమయంలో ఇన్ఫ్లుయెంజా మహమ్మారి సమయంలో ఎలా వ్యవహరించామో, ఇప్పుడూ అలాగే చేస్తున్నామని గులేరియా అభిప్రాయపడ్డారు.
అందరి బాధ్యత
పౌరుల బాధ్యతే కాదు ఇది అందరి బాధ్యత. మహమ్మారి ఇంకా ముగియలేదని చెప్పడం మా బాధ్యత కూడా. డిసెంబర్లోనే యూకేలో కొత్త వేరియంట్ వచ్చింది. అది ఎప్పుడో ఒకసారి ఇండియాకు కూడా వస్తుందని తెలుసు. అయినా కరోనా వెళ్లిపోయింది, అంతా బాగుంది అన్న ఓ తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పటికైనా అందరం కలిసి దీనికి ఓ పరిష్కారం కనుగొనాలి అని రణ్‌దీప్ అన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: వాషింగ్టన్, పడిక్కల్ దశ తిరిగింది.. ప్యూమాతో ఒప్పందం
IPL 2021: 40 ఏళ్ల వయసులో బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను: ధోనీ
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు
గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంబురాలు మొదలు
డీజిలైతే కిలోమీటర్‌కు రూ.18, ఎలక్ట్రికలైతే రూ.6
ఆరుపదుల వయస్సులోను జిమ్‌లో చెమటోడుస్తున్న స్టార్ హీరో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

