మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ డెడికేషన్, ఆయన ఎంపిక చేసుకునే పాత్రలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా దృశ్యం2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ లాల్ కంప్లీట్ యాక్టర్‌గా అదరగొట్టేశారు. ‘ఆరాట్టు’ అనే సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. రీసెంట్గా చిత్ర టీజర్ విడుదల కాగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ సినిమాని కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ‘బరోజ్’ అనే 3డీ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ చేతపట్టారు కంప్లీట్ యాకర్.
ఆరు పదుల వయస్సులోను క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ గడుపుతున్న మోహన్ లాల్ ఖాళీ సమయాలలో జిమ్లోను వర్కవుట్స్ చేస్తుంటారు. పాత్రకి న్యాయం చేసే క్రమంలో ఆయన తన బాడీని మలచుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. క్రమం తప్పకుండా జిమ్ లో కఠోర వ్యాయామాలు చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకునే మోహన్ లాల్ తాజాగా తన సోషల్ మీడియాలో జిమ్ వర్కవుట్కు సంబంధించిన ఫోటో షేర్ చేశారు. ఈ పిక్ ఆయన అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.