బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 14, 2020 , 18:31:24

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్టు

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్టు

మహబూబాబాద్‌ : జిల్లాలో నకిలీ కరెన్సీని చెలామణి చేసే ముఠాను పోలీసులు పట్టుకొని, వారి నుంచి రూ.3.5 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ కోటిరెడ్డి సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ముఠా సభ్యుల వివరాలు వెల్లడించారు. జిల్లాలోని మరిపెడ మండలం తండా ధర్మారానికి చెందిన గుగులోత్‌ కృష్ణ, ఏడిగడ్డతండాకు చెందిన ఒర్సు మహేశ్‌, గిరిప్రసాద్‌నగర్‌కు చెందిన ఆకారపు వెంకన్న, నల్లగొండ జిల్లా దామెర్లచర్ల మండలం రాళ్లవాగుకు చెందిన ధరావత్‌ రాందాస్‌(డ్రైవర్‌) సాలార్‌తండా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ నోట్లను మహబూబాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చెలామణి చేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 

వారి నుంచి పోలీసులు రూ.3.5 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని రెండు ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. కాగా, కృష్ణ, మహేష్‌, వెంకన్న, రాందాస్‌ను అరెస్టు చేయగా, గుగులోత్‌ రాజీవ్‌, సరియా, గుగులోత్‌ శ్రీనివాస్‌నాయక్‌, వాంకుడోతు వీరన్న, ఒర్సు నర్సింహ, గండికోట లక్ష్మయ్య పరారీలో ఉన్నారు. కాగా, ఈ నకిలీ కరెన్సీ ఎక్కడ తయారు చేస్తున్నారు? అనే విషయం పరారీలో ఉన్న వారు దొరికితే తెలుస్తుందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.              

logo