సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): విజిబుల్ పోలీసింగ్‌పై రాచకొండ సీపీ సుధీర్‌బాబు (CP Sudheer Babu) మహేశ్వరం జోన్ పోలీసులకు కీలక సూచనలు చేశారు. నేరాలను కట్టడి చేయడంలో విజిబుల్ పోలీసింగ్ (Visible Policing) చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. మంగళవారం డీసీపీ సునీతారెడ్డితో కలిసి బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పర్యటించారు సీపీ.
స్థానిక పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో విజుబుల్ పోలీసింగ్ చాల ముఖ్యమైందని.. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో తప్పని సరిగా ఈ విధానాన్ని అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు.