Shivvampeta : శివ్వంపేట, జూన్ 10 : తాము సాగుచేసుకుంటున్న భూములను రెగ్యులరైజ్ (Regularise) చేసి పట్టాపాసుబుక్కులు అందజేయాలని రెవెన్యూ అధికారులకు రైతులు వినతిపత్రం అందజేశారు. మంగళవారం ఉసిరికపల్లి (Usirikapally) గ్రామంలో ‘భూభారతి'(Bhu Bharathi) రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేనంబర్ 276 కొండయ్యగారి కుంట భూములను గత 30 సంవత్సరాలుగా 34 మంది రైతులు భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అధికారులకు తెలిపారు.
పాస్‌బుక్కులు లేకపోవడంతో తాము బ్యాంకు రుణాలు, సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరిన రైతులు.. తమకు పట్టా పాసుబుక్కులు అందజేయాలని డిప్యూటి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుష్మ, బీజేపీ యువనాయకులు అశోక్ సాదుల, రైతులు నల్ల బాలయ్య, సాదుల భాస్కర్, పోతరాజు బాలేశ్, నీరుడి బాలేష్, మల్లేశ్, సహదేవ్, రమేశ్, సాదుల లింగం, కుందనపల్లి సహదేవ్, లచ్చయ్య, దుర్గయ్య, లక్ష్మణ్, శివరాములు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.