TNPL 2025 : భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin)కు భారీ ఫైన్ పడింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL 2025)లో మహిళా అంపైర్‌తో గొడవ పడినందుకు అతడికి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత వేశారు రిఫరీ. జూన్ 8 ఆదివారం కొయంబత్తూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ సహనం కోల్పోయాడు. ఆవేశంగా ప్యాడ్లను బ్యాటుతో కొట్టాడు. చేతి గ్లోవ్స్‌ను విసిరిపడేశాడు. మైదానంలో అతడలా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు. సొంత రాష్ట్రమైన తమిళనాడు లీగ్‌లో అతడు దుండిగల్ డ్రాగన్స్(Dundigul Dragons)కు సారథ్యం వహిస్తున్నాడు. జూన్ 8 ఆదివారం తిరుప్పూర్ తంజిహన్స్తో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ సాయి కిశోర్ (Sai Kishore) బౌలింగ్‌లో యష్ ఎల్బీగా ఔటయ్యాడు. అంపైర్ క్రితికా (Kritika) ఔట్ ఇవ్వడంతో ఆమెతో గొడవకు దిగాడు అశ్విన్. బంతి ప్యాడ్లను తాకడానికి ముందే లెగ్ స్టంప్ దిశగా వెళ్లిందని అతడు వాదించాడు.
Ravichandran Ashwin got angry on Umpire, throws his gloves towards the spectators in Domestic League called TNPL 🧐
~ What’s your take on this 🤔 pic.twitter.com/5Dbk9AiSle
— Richard Kettleborough (@RichKettle07) June 9, 2025
అయితే.. అప్పటికే వాళ్ల జట్టు 2 డీఆర్‌ఎస్‌లను ఉపయోగించుకోవడంతో అంపైర్ నిర్ణయాన్ని అతడు సవాల్ చేయలేకపోయాడు. దాంతో, పెవిలియన్ వెళ్తూ వెళ్తూ కోపాన్ని నిగ్రహించుకోలేక గ్లోవ్స్‌ను విసిరిపారేశాడు. అతడి తీరును క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లాడు మ్యాచ్ రిఫరీ. దాంతో, అశ్విన్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించాలనుకున్నారు. కానీ, అతడు గ్లోవ్స్‌ను విసిరేసినందుకు మరో 20 శాతం ఫైన్ వేయాలని నిర్ణయించారు. అంటే.. మొత్తంగా 30 శాతం మ్యాచ్ ఫీజును అశ్విన్ కోల్పోనున్నాడు. ఈ మ్యాచ్‌లో తిరుప్పూర్ జట్టు మరో 49 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.