APPSC : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. గ్రూప్ -1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్‌ను వెల్లడించింది. 1:20 నిష్పత్తిలో అ భ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తామని తెలిపింది. నెల రోజుల్లోనే మెయిన్స్ ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ.. మౌఖిక పరీక్షలను కూడా సత్వరమే పూర్తి చేయాలనుకుంటోంది.
మెయిన్స్ దాటిన అభ్యర్థులకు జూన్ 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సన్నాహకాలు చేస్తోంది. మెయిన్స్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాలను వెబ్సైట్ https://psc.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. మొత్తం 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. 1,48,881 మంది ప్రిలిమ్స్‌కు రాయగా.. 4,496 మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.