నల్లగొండ సిటీ, జూన్ 10 : నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని దర్వేశిపురం శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఈఓగా అంబటి నాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఉత్తర్వులను స్వీకరించారు. అనంతరం దేవాలయం వద్దకు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. నాగిరెడ్డికి ఆలయ చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చంద్రంగౌడ్, జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు నాగోజు మల్లాచారి, అర్చకులు చిల్కమర్రి శ్రావణ్కుమారాచార్యులు, దామోదర్, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
కాగా ఇప్పటి వరకు ఇక్కడ ఈఓగా విధులు నిర్వహించిన జె.జయరామయ్య దేవాలయం నిర్వహణలో అలసత్వం వహిస్తుండటంతో బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఆలయంలో అవసరం లేనప్పటికి అర్చకులను నియమించాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు సాగించారని, మరోవైపు ఈ నెల 5 నుంచి 7వరకు జరిగిన అమ్మవారి బ్రహోత్సవాల్లోనూ ప్రొటోకాల్ పాటించకుండా వ్యహరించారనే ఆరోపణలు ఉన్నాయి.