ICC : అంతర్జాతీయ క్రికెట్లో చెరగని ముద్ర వేసిన ఆటగాళ్లను ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్‌తో గౌరవిస్తుంటుంది. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా ఘనత సాధించిన 11వ టీమిండియా ఆటగాడిగా మహీ నిలిచాడు. ఈసారి అతడితోపాటు మరో ఆరుగురు క్రికెటర్లకు ఆల్ ఆఫ్ ఫేమ్ గౌరవం కల్పించింది ఐసీసీ.
తొలినాళ్లలో టీమిండియాకు విశేష సేవలందించిన ఆటగాళ్లలో కొందరు ఈ మర్యాదను స్వీకరించారు. ధోనీ కంటే ముందు 11 మంది భారత దిగ్గజాలు ఆల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించారు. మనదేశం నుంచి తొలిసారి ఈ జాబితాలో చేరింది ఎవరో తెలుసా..
Legendary captain. A masterful batter. An iconic wicket-keeper. MS Dhoni has been inducted into the ICC Hall of Fame. With 17,266 international runs, 829 dismissals, and 538 matches for India, Dhoni’s career is a testament to excellence, consistency, and longevity. #MSDhoni… pic.twitter.com/H5ht0fwWJ9
— DD News (@DDNewslive) June 10, 2025
మాజీ ఓపెనర్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, 1983 వరల్డ్ కప్ ఛాంపియన్ జట్టుకు కెప్టెన్ కపిల్ దేవ్‌లు 2009లో ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ గౌరవం సంపాదించారు. 2015లో లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, వాల్‌గా పేరొందిన రాహుల్ ద్రవిడ్ 2018లో ఈ జాబితాలో చేరగా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2019లో వీళ్ల సరసన నిలిచాడు. వినోద్ మన్కడ్ కూడా ఆల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
MS Dhoni becomes only the 11th Indian to be inducted into the prestigious ICC Hall of Fame! 🇮🇳🏅
Honored for his legendary contributions to the game, both as a player and captain! 🏆🧤#MSDhoni #India #ICC #Sportskeeda pic.twitter.com/Ns9EBxLggw
— Sportskeeda (@Sportskeeda) June 9, 2025
మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, భారత మహిళా క్రికెట్ పురోగతికి దోహదపడిన డయాని ఎడుజి 2023లో .. 2024లో నీతు డేవిడ్‌లకు ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ గౌరవం కల్పించింది. ఇప్పుడు ఎంఎస్ ధోనీ కూడా వీళ్ల సరసన చేరాడు. మామూలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లను ఆల్ ఆఫ్ ఫేమ్‌లోకి తీసుకుంటుంది ఐసీసీ.
ఐదు సంవత్సరాల క్రితం చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన క్రికెటర్లు కూడా ఈ గౌరవాన్ని పొందేందుకు అర్హులే. తాజాగా ధోనీతో పాటు ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాజీలు వీళ్లే. గ్రేమ్ స్మిత్, హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా), మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), డానియల్ వెటోరీ (న్యూజిలాండ్), సారా టేలర్ (ఇంగ్లండ్), సనా మిర్ (పాకిస్థాన్)