శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 15:59:13

పొలానికి వెళ్తున్న యువకులపై ఎలుగుబంట్ల దాడి .. ఒకరు మృతి

పొలానికి వెళ్తున్న యువకులపై ఎలుగుబంట్ల దాడి .. ఒకరు మృతి

కోర్బా: పొలానికి వెళ్తున్న ఇద్దరు యువకులపై ఎలుగుబంట్లు దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్జాపూర్‌ జిల్లాలో ఈ  ఘటన జరిగింది. ప్రేమ్‌నగర్ అటవీ పరిధిలోని అభయ్‌పూర్ గ్రామానికి చెందిన శివకుమార్ పావ్లే (25)తోపాటు సన్నీసింగ్‌ (22)సైకిల్‌పై పొలానికి బయల్దేరారు. మార్గమధ్యలో రెండు ఎలుగుబంట్లు వీరిపై దాడి చేశాయి.

సింగ్ స్వల్పగాయాలతో వాటి బారినుంచి తప్పించుకోగా పావ్లే తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎలుగుబంట్లను అడవిలోకి తరిమి పావ్లేను దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సూరజ్‌పూర్ అటవీ విభాగం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) జేఆర్ భగత్ తెలిపారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.25 వేలు అందిచామని మరో రూ .5.75 లక్షల పరిహారం అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక ఇస్తామని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo