మైదా పిండి: ఒక కప్పు, క్యాబేజి, క్యాప్సికమ్, క్యారెట్ తురుము: పావుకప్పు చొప్పున, మిరియాల పొడి: పావు టీస్పూన్, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి: రెండు రెబ్బలు, వైట్ పెప్పర్ (తెల్ల మిరియాల పొడి): పావు టీస్పూన్, సోయా సాస్: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: రెండు టీస్పూన్లు.
ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లుపోసి ముద్దలా కలిపి పావుగంటపాటు మూతపెట్టి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో చిన్నగా తరిగిన క్యాబేజి, క్యాప్సికం, క్యారెట్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, వైట్ పెప్పర్, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, సోయా సాస్ వేసి కలపాలి. ముందుగా నానబెట్టిన పిండిని చిన్న పూరీల్లా ఒత్తుకుని మధ్యలో క్యాబేజి మిశ్రమం పెట్టి అంచులు మూసి మోమోలు చుట్టుకోవాలి. స్టవ్‌మీద గిన్నె పెట్టి గ్లాసు నీళ్లు పోసి వేడయ్యాక ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనె రాసి మోమోలను ఉంచాలి. ఆవిరి మీద పది నిమిషాలు ఉడికిస్తే వెజ్ మోమోస్ సిద్ధం.
Banana flower Vada Recipe | అరటిపువ్వు వడ తయారీ విధానం
Paneer Jalebi Recipe | పనీర్ జిలేబీ తయారీ విధానం
Bread Manchurian Recipe బ్రెడ్ మంచూరియా తయారీ విధానం
Broccoli Paneer Cutlet Recipe | బ్రకోలి పనీర్ కట్లెట్ తయారీ విధానం
Masala Panner fry Recipe | మసాలా పనీర్ ఫ్రై తయారీ విధానం