పనీర్ తురుము: ఒక కప్పు, ఉప్మా రవ్వ: రెండు టేబుల్ స్పూన్లు, మైదా: రెండు టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, పాలు: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, చక్కెర: ఒక కప్పు, రెడ్ ఫుడ్ కలర్: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా.
మిక్సీ జార్లో పనీర్, ఉప్మా రవ్వ, మైదా, కార్న్‌ఫ్లోర్, ఫుడ్ కలర్ వేసి కొద్దికొద్దిగా పాలుపోసి ముద్దలా వచ్చేలా గ్రైండ్ చేయాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి చక్కెర వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి దించేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడి చేయాలి. పనీర్ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్‌లో కానీ, పాలప్యాకెట్ కవర్లో కానీ వేసి కాగిన నూనెలో జిలేబీల్లా ఒత్తుకుని దోరగా కాల్చుకోవాలి. కాలిన జిలేబీలను పాకంలో వేసి అర
గంటపాటు నానిన తర్వాత, సర్వ్ చేసుకుంటే నోరూరించే పనీర్ జిలేబీ సిద్ధం.
Masala Panner fry Recipe | మసాలా పనీర్ ఫ్రై తయారీ విధానం”
Bread Manchurian Recipe బ్రెడ్ మంచూరియా తయారీ విధానం”
Broccoli Paneer Cutlet Recipe | బ్రకోలి పనీర్ కట్లెట్ తయారీ విధానం”
China Grass Halwa Recipe | చైనా గ్రాస్ హల్వా తయారీ విధానం”
“Spicy Egg Curry Recipe | స్పైసీ ఎగ్ కర్రీ తయారీ విధానం”