బ్రెడ్‌స్లైసెస్: నాలుగు, సన్నగా తరిగిన క్యారెట్, క్యాబేజి: అర కప్పు చొప్పున, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, సోయాసాస్, చిల్లీ సాస్, టమాట సాస్: ఒక టీస్పూన్ చొప్పున, అజినమోటో: అర టీస్పూన్, నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, చక్కెర: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు టీ స్పూన్లు, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: వేయించడానికి సరిపడా.
బ్రెడ్ స్లైసుల్ని చిన్నగా తుంచాలి. ఒక గిన్నెలో బ్రెడ్, క్యాబేజి, క్యారెట్ తురుము, అర టీస్పూన్ ఉప్పు వేసి నీళ్లు పోయకుండా ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న బాల్స్‌లా చేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక అప్పటికే చేసిపెట్టుకున్న బాల్స్‌ను దోరగా వేయించాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి, వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వేసి కాస్త వేగాక సోయా, టమాట, చిల్లీ సాస్ జోడించి కొద్దిగా నీళ్లుపోసి మరగనివ్వాలి. మరుగుతున్న మిశ్రమంలో నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, చక్కెర, నిమ్మరసం, ఉప్పు, అజినమోటో, బ్రెడ్ బాల్స్ కూడా వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. అన్నీ బాగా వేగాక చివరగా ఉల్లికాడలు, కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి బ్రెడ్ మంచూరియా సిద్ధం.
Air Fried Coconut Shrimp Recipe | ఎయిర్ ఫ్రైడ్ కోకోనట్ ష్రింప్”
Health Tips | అత్యధిక కాలం జీవించే వారు ఏం తింటారో తెలుసా..!”
Cheese Bread omelette Recipe | చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం”
bread pockets | ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసుకోండి”