China Grass Halwa Recipe | చైనా గ్రాస్ హల్వా తయారీ విధానం
కొత్త వంట : China Grass Halwa Recipe | చైనా గ్రాస్ హల్వా తయారీ విధానం
ఏం కావాలి?
చైనా గ్రాస్: 10 గ్రా, పాలు: అర లీటర్, చక్కెర: అర కప్పు, బాదం పప్పు: పావు కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, నెయ్యి: కొద్దిగా, ముక్కలు చేసిన డ్రైఫ్రూట్స్:
ఒక టేబుల్ స్పూన్.
ఎలా చేయాలి?
చైనా గ్రాస్‌ను పది నిమిషాలపాటు నీళ్లలో నానబెట్టాలి. బాదం పప్పును మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి పాలు పోసి మరుగుతుండగా చక్కెర, బాదం పొడి వేయాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. పాల మిశ్రమం కాస్త దగ్గరపడ్డాక యాలకుల పొడి, మెదిపిన చైనా గ్రాస్ వేసి మరో ఐదు నిమిషాలు సన్నని మంటపై కలుపుతూ ఉడికించి దించేయాలి. ఒక గిన్నెకు కొద్దిగా నెయ్యి రాసి చల్లారిన మిశ్రమాన్ని దాంట్లో పోసి పైనుంచి డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి 4-5 గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. గట్టిపడిన మిశ్రమాన్ని ముక్కలుగా కోసుకుంటే చల్లచల్లని చైనా గ్రాస్ హల్వా సిద్ధం. ఇష్టపడే వాళ్లు పింక్, రెడ్, గ్రీన్ ఫుడ్ కలర్లను మరుగుతున్న మిశ్రమంలో జతచేసుకుని.. రంగురంగుల హల్వాతినేయవచ్చు. దీనిలో పోషక విలువలు అపారంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
Read More Recipes
“Sweet Boondi Recipe | స్వీట్ బూందీ తయారీ విధానం”
“Egg Karam Dosa Recipe | ఎగ్ కారం దోసె తయారీ విధానం”
“Mango Papaya Salad Recipe | మామిడి బొప్పాయి సలాడ్ తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

