శనగపిండి: ఒక కప్పు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, చక్కెర: ఒక కప్పు, యాలకుల పొడి: పావు టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: చిటికెడు.
శనగపిండిలో చిటికెడు ఉప్పు, బియ్యపు పిండి వేసి నీళ్లుపోసి కొంచెం జారుగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి వేడయ్యాక పిండి మిశ్రమాన్ని చిన్నరంధ్రాలు ఉండే గరిటె లేదా బూందీ ప్లేట్‌పై వేసి చిన్న బూందీ చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి చక్కెర, కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ లేత పాకం పట్టుకోవాలి. పాకం మరుగుతుండగా యాలకుల పొడి వేసి దించేయాలి. వేయించిన బూందీని పాకంలో కలిపితే స్వీట్ బూందీ సిద్ధం. పిండిలో రకరకాల ఫుడ్ కలర్స్ కలుపుకొని కలర్ బూందీ కూడా చేసుకోవచ్చు.
Spicy Egg Curry Recipe | స్పైసీ ఎగ్ కర్రీ తయారీ విధానం
Mango Papaya Salad Recipe | మామిడి బొప్పాయి సలాడ్ తయారీ విధానం
Mushroom Toast Recipe | మష్రూమ్ టోస్ట్ తయారీ విధానం
Shabnam Curry Recipe | షబ్నమ్ కర్రీ తయారీ విధానం