Shabnam Curry Recipe | షబ్నమ్ కర్రీ తయారీ విధానం
షబ్నమ్ కర్రీ తయారీకి కావలసిస పదార్థాలు
క్యాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, పుట్టగొడుగులు, పనీర్: అరకప్పు చొప్పున (తరిగిన ముక్కలు), స్వీట్‌కార్న్: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిబఠాణీ: ఒక టేబుల్‌స్పూన్, టమాటాలు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: నాలుగు, నెయ్యి: పావుకప్పు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు: రెండు చొప్పున, దాల్చిన చెక్క: అంగుళం ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, పెరుగు: పావు కప్పు, పసుపు: ఒక టీస్పూన్, జీలకర్ర: ఒక టీస్పూన్, ధనియాలపొడి: ఒక టీస్పూన్, కసూరీ మేతి: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత
Shabnam Curry Recipe | షబ్నమ్ కర్రీ తయారీ విధానం
కూరగాయ ముక్కలన్నిటినీ కడిగి పది నిమిషాలపాటు ఉప్పు నీటిలో ఉడికించి నీళ్లు వంపి పక్కన పెట్టుకోవాలి. వంపిన నీటిని వేరే పాత్రలో పక్కన ఉంచుకోవాలి. టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని విడివిడిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముద్ద, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. టమాట పేస్టు కూడా వేసి కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక గిన్నెలో పెరుగు, ధనియాలపొడి, కారం, పసుపు, కసూరీ మేతి, ఉప్పు వేసి బాగా కలిపి టమాట మిశ్రమంలో వేసి కలిపి మూతపెట్టి సన్నటిమంటపై రెండు నిమిషాలు ఉడికించాలి. మొదట్లో కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు పోసి మరో అయిదు నిమిషాలు ఉడకనివ్వాలి. నూనె పైకి తేలుతుండగా కూరగాయ ముక్కలు వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మూతపెట్టాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లుకుంటే ఉత్తరాది స్పెషల్ షబ్నమ్ కర్రీ సిద్ధం.
Read More :
Gongura Royyala Iguru Recipe | గోంగూర రొయ్యల ఇగురు తయారీ విధానం”
చికెన్ ఆలూ కుర్మా తయారీ విధానం”
broccoli tandoori recipe | బ్రొకోలీ తందూరీ తయారీ విధానం”
Masala Macaroni recipe | మసాలా మ్యాకరోని తయారీ విధానం”
Cheese Bread omelette Recipe | చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

