చికెన్ ఆలూ కుర్మా తయారీ విధానం
Chicken Aloo Kurma Recipe | కావలసిన పదార్థాలు
చికెన్: 500 గ్రా; ఆలుగడ్డ: ఒకటి (పెద్దది), టమాట: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, ఉల్లిగడ్డ: ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, ధనియాల పొడి, కారం: ఒక టీస్పూన్ చొప్పున, నూనె: అరకప్పు, పచ్చికొబ్బరి తురుము: అరకప్పు, జీడిపప్పు: పది, తర్బూజ గింజలు, గసగసాలు: ఒక టేబుల్‌స్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము: కొద్దిగా, నిమ్మరసం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్.
చికెన్ ఆలూ కుర్మా తయారీ విధానం
ముందుగా పచ్చికొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, తర్బూజ గింజలను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా ముద్దగా చేసుకోవాలి. చికెన్‌ను బాగా కడిగి ఉప్పు, నిమ్మరసం కలిపిన నీళ్లలో గంటపాటు నానబెట్టాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేగాక.. తరిగిన టమాట ముక్కలు జోడించి మగ్గించాలి. కారం, ధనియాల పొడి, పచ్చికొబ్బరి మిశ్రమం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం మరుగుతుంటే తరిగిన ఆలుగడ్డ ముక్కలు, నానబెట్టిన చికెన్ కలిపి.. మూతపెట్టి సన్నటిమంటపై అరగంటపాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే నోరూరించే చికెన్ ఆలూ కుర్మా సిద్ధం.
Read More :
broccoli tandoori recipe | బ్రొకోలీ తందూరీ తయారీ విధానం
Masala Macaroni recipe | మసాలా మ్యాకరోని తయారీ విధానం
Butter garlic chicken l బటర్ గార్లిక్ చికెన్ తయారీచేసే విధానం
chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

