Masala Macaroni recipe | మసాలా మ్యాకరోని తయారీ విధానం
మసాలా మ్యాకరోని తయారీకి కావలసిన పదార్థాలు
మ్యాకరోని: ఒక కప్పు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, జీలకర్ర: అర టీస్పూన్, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిగడ్డ: చిన్నది, పసుపు: చిటికెడు, చిన్నగా తరిగిన టమాట, క్యాప్సికం ముక్కలు: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి: పావు టీస్పూన్ చొప్పున, కారం: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా.
Masala Macaroni recipe | మసాలా మ్యాకరోని తయారీ విధానం
ముందుగా మ్యాకరోనీని పది నిమిషాలు ఉడికించి నీళ్లు వంచి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర, చిన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. బాగా వేగాక టమాట ముక్కలు జోడించి రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గించాలి. పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, క్యాప్సికం ముక్కలు కలిపి ఒక కప్పు నీళ్లుపోసి ఉడికించాలి. మిశ్రమం ఉడుకుతుంటే మ్యాకరోని వేసి నీరు ఇగిరిపోయే వరకు కలుపుతూ వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే కారం కారంగా నోరూరించే మసాలా మ్యాకరోని సిద్ధం.
Read More :
Cheese Bread omelette Recipe | చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం
Coconut rice recipe | కొబ్బరన్నం తయారీ విధానం
Ravva cake recipe | రవ్వ కేక్ తయారీ విధానం
Sankranti Special | పంచదార చిలుకలు ఎలా తయారు చేస్తారో తెలుసా
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

