మరమరాలు: ఒక కప్పు, శెనగపిండి, బియ్యపు పిండి: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, కారం: ఒక టీస్పూన్, పచ్చిమిర్చి తురుము: ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి, కొత్తిమీర తురుము: కొద్దిగా, కరివేపాకు: రెండు రెబ్బలు, జీలకర్ర: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
ఒక గిన్నెలో మరమరాలు, బియ్యపు పిండి, శెనగపిండి, కారం, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తురుము, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి కొద్ది
కొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, బాగా వేడయ్యాక మరమరాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గుండ్రని బోండాల్లా వేసి దోరగా కాల్చుకుంటే వేడివేడి మరమరాల బోండాలు సిద్ధం.
Mushroom Toast Recipe | మష్రూమ్ టోస్ట్ తయారీ విధానం
Aloo Kurkure Recipe | ఆలూ కుర్కురే తయారీ విధానం
Rooh Afza | 105 ఏండ్ల క్రితం తయారు చేసిన ఈ పానీయం స్పెషాలిటీ ఏంటో తెలుసా
Egg Karam Dosa Recipe | ఎగ్ కారం దోసె తయారీ విధానం