Rooh Afza | 105 ఏండ్ల క్రితం తయారు చేసిన ఈ పానీయం స్పెషాలిటీ ఏంటో తెలుసా
Rooh Afza Recipe | గులాబీ షర్బత్ లేదా రూహ్ ఆఫ్జా దశాబ్దాలుగా ఇఫ్తార్ విందులో విడదీయరాని భాగమైపోయింది. రంజాన్ మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా మంచినీళ్లు కూడా ముట్టుకోరు. కాబట్టి, దాహాన్ని తట్టుకోవడానికి, శక్తిని సమకూర్చుకోవడానికి, శరీరం హైడ్రేట్ అవడానికి రూహ్ ఆఫ్జా దోహదపడుతుంది. నూట అయిదు సంవత్సరాల క్రితం.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హకీం హఫీజ్ అబ్దుల్ మజీద్ ఈ పానీయాన్ని రూపొందించారు. ఉర్దూలో రూహ్ అంటే ‘ఆత్మ’ అని, ఆఫ్జా అంటే ‘పోషణ’ అని అర్థం.
కావలసిన పదార్థాలు
రూహ్ ఆఫ్జా (గులాబీ సిరప్): 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, నల్లుప్పు: రెండూ పావు టీ స్పూన్ చొప్పున, మిరియాల పొడి: పావు టీస్పూన్, పుదీనా ఆకులు: 3 లేదా 4, ఐస్ క్యూబ్స్: తగినన్ని, నానబెట్టిన సబ్జా గింజలు: 2 టేబుల్ స్పూన్లు, చల్లటి సోడా నీళ్లు: ఒక పెద్ద గ్లాసు.
తయారీ విధానం
ఒక పెద్దగ్లాసులో నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత ఉప్పు, నల్లుప్పు, రూహ్ ఆఫ్జా సిరప్, మిరియాల పొడి, పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ కూడా గ్లాసులో వేసేయాలి. ఈ మిశ్రమానికి నానబెట్టిన సబ్జా గింజలు కలపాలి. ఆ తర్వాత చల్లటి సోడా నీళ్లను గ్లాసులో పోయాలి. బాగా కలిపితే చల్లచల్లటి రూహ్ ఆఫ్జా పానీయం సిద్ధం. లస్సీ తర్వాత హైదరాబాదీలకు అత్యంత ఇష్టమైన పానీయం ఇది.
Read More :
Egg Karam Dosa Recipe | ఎగ్ కారం దోసె తయారీ విధానం
Pakam Garelu Recipe | పాకం గారెలు తయారీ విధానం
Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం
Noodles Momos Recipe | నూడుల్స్ మోమోస్ తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

