మినుప పప్పు: ఒక కప్పు, బెల్లం: రెండు కప్పులు, మిరియాలు: ఒక టీస్పూన్, యాలకులు: నాలుగు, వంటసోడా: చిటికెడు, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: పావు టీస్పూన్.
మినుప పప్పును బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. బెల్లాన్ని సన్నగా తరగాలి. మినుప పప్పులో నీళ్లు వంపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి బెల్లం వేసి, ఒక కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం మరుగుతుండగా పైన పేరుకున్న తెల్లని నురగ తీసేసి యాలకులు, మిరియాలను మెత్తగా పొడి చేసి వేయాలి. కాస్త దగ్గర పడ్డాక దింపేయాలి. మినుప పప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి ఉప్పు, వంటసోడా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక మినుప పప్పు మిశ్రమాన్ని చేత్తో గారెల్లా ఒత్తుకొని వేయించాలి. గారెలను పాకంలో వేసి గంటపాటు నానబెట్టుకుంటే పాకం గారెలు సిద్ధం.
Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం
Noodles Momos Recipe | నూడుల్స్ మోమోస్ తయారీ విధానం
Mango Falooda Recipe | మ్యాంగో ఫాలూదా తయారీ విధానం
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీ విధానం