బొంబాయి రవ్వ: రెండు కప్పులు, పుల్లటి పెరుగు: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, చక్కెర: ఒక టీస్పూన్, ఆవాలు, నువ్వులు: అర టీస్పూన్ చొప్పున, నూనె: పావు కప్పు, కరివేపాకు: ఒక రెబ్బ, అల్లం: అంగుళం ముక్క, బేకింగ్ సోడా: పావు టీస్పూన్,
బేకింగ్ పౌడర్: ఒక టీస్పూన్.
రవ్వను మిక్సీ జార్లో వేసి ఒక నిమిషంపాటు గ్రైండ్ చేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి, అల్లం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉప్పు, చక్కెర, పచ్చిమిర్చి మిశ్రమం వేసి కొద్దికొద్దిగా నీళ్లుపోసి ఇడ్లీ పిండిలా కలిపి మూతపెట్టి పదినిమిషాలు పక్కన పెట్టాలి. నానిన పిండిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి మరోసారి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనెరాసి రవ్వ మిశ్రమం వేసుకోవాలి. వెడల్పాటి కుక్కర్లో నీళ్లు పోసి, రవ్వ మిశ్రమం వేసిన గిన్నె పెట్టి ఆవిరిపై 20 నిమిషాలు ఉడికించాలి. బాగా ఉడికిన ఢోక్లాను చల్లారాక ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి.. వేడయ్యాక ఆవాలు, నువ్వులు, చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన పోపును ముక్కలుగా కోసుకున్న ఢోక్లాపై వేసుకుని కలుపుకొంటే ఘుమఘుమలాడే ఫలహారం సిద్ధం.
“Mixed Fruit Mocktail Recipe | మిక్స్డ్ ఫ్రూట్ మాక్‌టెయిల్ తయారీ విధానం”
“Coconut Orange Blend Recipe | కోకోనట్ ఆరెంజ్ బ్లెండ్ తయారీ విధానం”
Pineapple Honey Mocktail Recipe | పైనాపిల్ హనీ మాక్‌టెయిల్ తయారీ విధానం”
“Air Fried Coconut Shrimp Recipe | ఎయిర్ ఫ్రైడ్ కోకోనట్ ష్రింప్”