నూడుల్స్: ఒక కప్పు, గోధుమ పిండి: ఒక కప్పు, చిన్నగా తరిగిన క్యాబేజి, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు: పావు కప్పు చొప్పున, వెల్లుల్లి రెబ్బలు: రెండు, నూనె: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, సోయాసాస్, చిల్లీసాస్, టమాట సాస్: ఒక టీస్పూన్ చొప్పున, నూడుల్స్ మసాలా: ఒక టీస్పూన్.
ఒక గిన్నెలో గోధుమపిండి, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి తడిగుడ్డ వేసి గంటపాటు నానబెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి బాగా వేగాక.. క్యారెట్, క్యాబేజి, బీన్స్ జోడించి ఒక నిమిషంపాటు వేయించాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఆ నీళ్లు మరుగుతుండగా నూడుల్స్, నూడుల్స్ మసాలా, సోయా, టమాట, చిల్లీ సాస్‌లు, కొద్దిగా ఉప్పు వేసి రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. ఇప్పుడు గోధుమ పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చిన్నగా పూరీల్లా ఒత్తుకుని మధ్యలో నూడుల్స్ మిశ్రమం పెట్టి అంచులు మూసేయాలి. వాటిని ఆవిరిపై పది నిమిషాలు ఉడికిస్తే నూడుల్స్ మోమోలు సిద్ధం.
“Mango Falooda Recipe | మ్యాంగో ఫాలూదా తయారీ విధానం”
Rava Dhokla Recipe | రవ్వ ఢోక్లా తయారీ విధానం”
“Paan shots recipe | పాన్ షాట్స్ తయారీ విధానం”
Mixed Fruit Mocktail Recipe | మిక్స్డ్ ఫ్రూట్ మాక్‌టెయిల్ తయారీ విధానం”