గుడ్లు: నాలుగు, బియ్యం: రెండున్నర కప్పులు, మినుప పప్పు: ఒక కప్పు, అటుకులు: అరకప్పు, మెంతులు: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: అర కప్పు, ఎండు మిరప
కాయలు: ఒక కప్పు, వెల్లుల్లి: ఒకటి, ఆవాలు: ఒక టీస్పూన్, కరివేపాకు: రెండు రెబ్బలు.
బియ్యం, మినుప పప్పు, మెంతులు, అటుకులను బాగా కడిగి వేరువేరుగా ఆరు గంటలు నానబెట్టి మెత్తగా పిండి పట్టుకొని పన్నెండు గంటలపాటు నానబెట్టాలి. మిక్సీ జార్లో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి కొన్ని నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి మిశ్రమం వేసి నూనె పైకి తేలేంతవరకు కలుపుతూ బాగా ఉడికించాలి. నానిన పిండిలో తగినంత ఉప్పు వేసి కలపాలి. స్టవ్‌మీద దోసెల పెనం పెట్టి వేడయ్యాక పిండితో దోసె వేసి పైనుంచి ఒక గుడ్డు, ఒక టేబుల్ స్పూన్ కారం మిశ్రమం వేసి స్ప్రెడ్ చేయాలి. చుట్టూ నూనె వేస్తూ సన్నని మంటపై రెండు వైపులా కాల్చుకుంటే వేడివేడి ఎగ్ కారం దోసె సిద్ధం.
Vankaya Bajji Recipe | వంకాయ బజ్జీ తయారీ విధానం”
Pakam Garelu Recipe | పాకం గారెలు తయారీ విధానం”
“Noodles Momos Recipe | నూడుల్స్ మోమోస్ తయారీ విధానం”
“Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం”