Corn Cutlet Recipe | కార్న్ కట్లెట్ తయారీ విధానం
Corn Cutlet Recipe | కార్న్ కట్లెట్ తయారీకి కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు(పచ్చివి): ఒక కప్పు, బియ్యపు పిండి, శనగ పిండి: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కారం, ధనియాల పొడి: ఒక టీస్పూన్ చొప్పున, జీలకర్ర: అర టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, కరివేపాకు, కొత్తిమీర తురుము: కొద్దిగా, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా.
Corn Cutlet Recipe | కార్న్ కట్లెట్ తయారీ విధానం
మొక్కజొన్న గింజల్ని బరకగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో కార్న్ ముద్ద, తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, నిమ్మరసం, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, శనగ పిండి, బియ్యపు పిండి వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనెవేసి వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అర
చేతిలో పెట్టి కట్లెట్లలా ఒత్తుకోవాలి. వాటిని వేడి నూనెలో వేసి రెండువైపులా తిప్పుతూ ముదురు రంగులోకి మారేవరకు సన్నని మంటపై కాల్చుకుంటే వేడివేడి కార్న్ కట్లెట్ సిద్ధం.
Read More :
Soya Dum Biryani Recipe | సోయా దమ్ బిర్యానీ ఎలా వండాలి?
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

