Soya Dum Biryani Recipe | సోయా దమ్ బిర్యానీ ఎలా వండాలి?
Soya Dum Biryani Recipe | సోయా దమ్ బిర్యానీ తయారీకి ఏం కావాలి?
మీల్మేకర్ (సోయా చంక్స్): ఒక కప్పు, బాస్మతి బియ్యం: రెండు కప్పులు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, లవంగాలు: ఎనిమిది, యాలకులు: నాలుగు, మరాఠి మొగ్గ: ఒకటి, దాల్చినచెక్క: అంగుళం ముక్కలు రెండు, సాజీరా: రెండు టీస్పూన్లు, బిర్యానీ ఆకులు: నాలుగు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు, ధనియాలపొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా: ఒక టీస్పూన్ చొప్పున, పెరుగు: అర కప్పు, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిబఠాణీలు: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, పుదీనా, కొత్తిమీర తురుము: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, వేయించిన ఉల్లిపాయ ముక్కలు: అర కప్పు, నెయ్యి: అర కప్పు, నూనె: ఒక టేబుల్ స్పూన్, నిమ్మకాయ: ఒకటి, ఉప్పు: తగినంత, ఎండిన గులాబీ రెక్కలు: ఒక టేబుల్ స్పూన్, రోజ్‌వాటర్: ఒక టీస్పూన్, రెడ్ఫుడ్ కలర్: చిటికెడు
Soya Dum Biryani Recipe | సోయా దమ్ బిర్యానీ ఎలా వండాలి?
మీల్‌మేకర్‌ను పది నిమిషాలపాటు వేడినీళ్లలో నానబెట్టి గట్టిగా పిండుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని కడిగి గంటపాటు నానబెట్టాలి. ఒక గిన్నెలో మీల్మేకర్, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర తురుము, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. స్టవ్‌మీద మందపాటి గిన్నెపెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక టీస్పూన్ సాజీర, రెండు యాలకులు, నాలుగు లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, రెండు బిర్యానీ ఆకులు వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక మీల్మేకర్ మిశ్రమం వేసి అరగ్లాసు నీళ్లుపోసి సన్నని మంటపై రెండు నిమిషాలు ఉడికించాలి. మరో స్టవ్‌మీద గిన్నె పెట్టుకుని రెండు లీటర్ల నీళ్లు దాల్చినచెక్క, సాజీర, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉప్పు, గులాబీ రెక్కలు, నూనె వేసి మరిగాక బాస్మతీ బియ్యం వేసి ఉడికించాలి. సగానికి పైగా ఉడికిన అన్నాన్ని తీసి ఉడుకుతున్న మీల్మేకర్ మిశ్రమంపై వేసి పైనుంచి వేయించిన ఉల్లిపాయ ముక్కలు, రోజ్ వాటర్, పుదీనా, కొత్తిమీర తురుము, ఫుడ్ కలర్ వేసి మూతపెట్టి ఇరవై నిమిషాలపాటు సన్నని మంటపై ఉంచాలి. దించిన తర్వాత మరో పదినిమిషాలు ఆగి వడ్డించుకుంటే వేడివేడి సోయా దమ్ బిర్యానీ సిద్ధం.
Read More :
“Paneer Dum Biryani Recipe | పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

