Paneer Dum Biryani Recipe | పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ
Paneer Dum Biryani Recipe | పన్నీర్ దమ్ బిర్యానీ తయారీకి ఏం కావాలి?
పనీర్ ముక్కలు: ఒక కప్పు, బాస్మతి బియ్యం: ఒక కప్పు, పెరుగు: అర కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు, కారం: ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా: ఒక టీస్పూన్ చొప్పున, దాల్చిన చెక్క: రెండంగుళాల ముక్క, యాలకులు: పది, లవంగాలు: నాలుగు, మిరియాలు: అర టీస్పూన్, సాజీర: ఒక టీస్పూన్, బిర్యానీ ఆకులు: రెండు, అనాసపువ్వు: చిన్నముక్క, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మకాయ: ఒకటి, ఉప్పు: తగినంత, కొత్తిమీర, పుదీనా తురుము: రెండు టేబుల్ స్పూన్లు, ఎండిన గులాబీ రేకులు: ఒక టేబుల్ స్పూన్, రోజ్ వాటర్: ఒక టీస్పూన్.

Paneer Dum Biryani Recipe | పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా వండాలి?
ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి గంటపాటు నానబెట్టాలి. ఒక మందపాటి గిన్నెలో పనీర్ ముక్కలు, పెరుగు, పుదీనా, కొత్తిమీర తురుము, అరకప్పు వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, దాల్చిన చెక్క ముక్క, నాలుగు యాలకులు, సగం మిరియాలు, కొద్దిగా సాజీర, ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి, నూనె, అనాసపువ్వు, రెండు లవంగాలు, సగం చెక్క నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు లీటర్ల నీళ్లు పోసి ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి, మిగిలిన దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, సాజీర, మిరియాలు, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, గులాబీ రెక్కలు వేసి బాగా మరిగాక బాస్మతి బియ్యం వేసి ఉడికించాలి. పైన పేరుకుపోయే నురగను తీసిపడేస్తూ.. అన్నం సగానికి పైగా ఉడికిన తర్వాత పనీర్ ముక్కలు పైనుంచి వేసి.. కొత్తిమీర, పుదీనా తురుము, వేయించిన ఉల్లిపాయ ముక్కలు చిలకరించాలి. ఆపైన మూతపెట్టి పావుగంటపాటు సన్నటి మంటపై ఉడికించాలి. స్టవ్ ఆపేసిన పది నిమిషాల తర్వాత వడ్డించుకుంటే నోరూరించే పనీర్ దమ్ బిర్యానీ సిద్ధం.
Read More Recipes :
“paneer samosa recipe | పనీర్ సమోసా తయారీ విధానం”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

