Egg Manchurian Recipe | ఎగ్మంచూరియా తయారీ విధానం
Egg Manchurian Recipe | ఎగ్మంచూరియా తయారీ విధానం కావలసిన పదార్థాలు
గుడ్లు: ఐదు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మైదాపిండి: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి: ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: పావు టీస్పూన్, డార్క్ సోయా సాస్: ఒక టీస్పూన్, టమాట కెచప్: ఒక టేబుల్ స్పూన్, అజినమోటో: అర టీస్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పచ్చిమిర్చి: రెండు, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, చక్కెర: అర టీస్పూన్, తెల్లమిరియాల పొడి: అర టీస్పూన్, వెనిగర్/నిమ్మరసం: ఒక టీస్పూన్.
Egg Manchurian Recipe | ఎగ్మంచూరియా తయారీ విధానం
నాలుగు గుడ్లను ఉడకబెట్టి నిలువుగా నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఉప్పు, పావు టీస్పూన్ మిరియాలపొడి, మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డు ముక్కలను పిండి మిశ్రమంలో ముంచి విడివిడిగా నూనెలో దోరగా కాల్చుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి.. బాగా వేగాక, మిరియాల పొడి, ఉప్పు, చక్కెర, సోయాసాస్, టమాట కెచప్, చిల్లీ పేస్ట్, అజినమోటో, తెల్ల మిరియాల పొడి, వెనిగర్ వేసి అరకప్పు నీళ్లుపోసి బాగా ఉడికించాలి. ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగా వేయించిన గుడ్డు ముక్కలను వేసి బాగా కలిపి పైనుంచి ఉల్లికాడల తురుము వేసుకుంటే వేడివేడి ఎగ్ మంచూరియా సిద్ధం.
Read More :
Broccoli Manchurian | బ్రకోలి మంచూరియా తయారీ ఇలా..”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

