ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman daughter) కూతురు ఖతిజా రెహమాన్ (Khatija Rahman) త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. రియాస్ దీన్ షేక్ మహ్మద్ (Riyasdeen Shaik Mohamed)తో తన నిశ్చితార్థం (engagement) పూర్తయినట్టు జనవరి 2న ఖతిజా ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అందరితో పంచుకుంది. రియాస్ తో నిశ్చితార్థం పూర్తయినట్టు ఖతిజా తెలియజేసింది. రియాస్ పారిశ్రామికవేత్త, ఆడియో ఇంజినీర్. తన భర్తను పరిచయం చేస్తూ ఇదే విషయాన్ని పంచుకుంది ఖతిజా.
అందరి శుభాశీస్సులతో..రియాస్ దీన్తో నా ఎంగేజ్మెంట్ వార్తను ప్రకటించడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 29న నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నా ఎంగేజ్ మెంట్ పూర్తయింది..అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఏఆర్ రెహమాన్-సైరా బాను దంపతులకు ముగ్గురు సంతానం..ఖతిజా, రహీమా, ఏఆర్ అమీన్. కాగా ఖతిజా పెద్ద కూతురు. పలు తమిళ చిత్రాలతో పాటలు పాడి చాలా మంది ఫాలోవర్లనుసంపాదించుకుంది ఖతిజా. రజినీకాంత్ నటించిన ఎంథిరన్ సినిమాతో సింగర్‌గా తొలి పాట పాడింది ఖతిజా.
2020లో కాంట్రవర్సియల్ రైటర్ తస్లీమా నస్రీన్ ఊపిరాడనీయడం లేదంటూ తన బురఖా గురించి స్పందించడంతో ఖతీజా వివాదంలో చిక్కుకుంది. అయితే తనకు నచ్చినవి వేసుకోవడం తన ఇష్టమని..ఖతిజా ఈ వివాదంపై కామెంట్స్ చేసిన వార్తల్లో నిలిచింది.