సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెద్ద సినిమాల (Big Movies) విడుదల తేదీలు దగ్గరకొస్తున్నాయి. ఈ సంక్రాంతి కానుకగా ఆర్ఆర్ఆర్ (RRR), భీమ్లానాయక్ (bheemla nayak) చిత్రాలు రావాల్సి ఉండగా..వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు (Small movies) చిన్న సినిమాలు సిద్దమవుతున్నాయి. భారీ సినిమాలొచ్చే తేదీని రిలీజ్ డేట్‌గా ఫైనల్ చేస్తున్నారు మేకర్స్.
టాలీవుడ్ (Tollywood) యువ హీరో ఆది (Aadi Sai Kumar) నటిస్తోన్న చిత్రం అతిథి దేవోభవ (Atithi Devo Bhava)క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ డేట్ ను సెలెక్ట్ చేసుకుంది. ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో అదే రోజున అంటే జనవరి 7న అతిథి దేవో భవ విడుదల కానుంది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో నువేక్ష హీరోయిన్గా నటిస్తోంది. రోహిణి మొల్లేటి, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజబాబు మిరియాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
"సంక్రాంతి రాజు" is back to race⚡
— BA Raju's Team (@baraju_SuperHit) January 2, 2022
Mega filmmaker @MSRajuOfficial’s New-age Rom-Com flick #7Days6Nights to release for this Sankranthi✨@MSumanthAshwin @RajnikantSOffl @SamarthGollapu5 @EditorJunaid @SumanthArtPro @WildHoneyPro #WintagePictures @AbgCreations @PulagamOfficial pic.twitter.com/mvBmK9Nlh1
మరోవైపు సీనియర్ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు (MS Raju) తెరకెక్కిస్తోన్న చిత్రం 7 డేస్ 6 నైట్స్ (7 Days 6 Nights) సంక్రాంతి బరిలో జనవరి 14న విడుదల కానుంది. ఎంఎస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుమంత్ అశ్విన్, మెహర్ చావల్ హీరోహీరోయిన్లుగా రొమాంటిక్ కామెడీగా వస్తున్న ఈ చిత్రానికి సమర్థ్ గొల్లపూడి మ్యూజిక్ డైరెక్టర్. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్.
Get ready to meet the #RowdyBoys in a theatre near you.
— BA Raju's Team (@baraju_SuperHit) January 2, 2022
IN THEATRES THIS SANKRANTHI #Ashish@anupamahere @HarshaKonuganti @ThisisDSP @Madhie1 @SVC_official @adityamusic#sahidevvikram #karthikrathnam #tejkurapati @komaleeprasad pic.twitter.com/V0rWPYKZRn
వీటితోపాటు అగ్ర నిర్మాత దిల్ రాజు మేనల్లుడు అశిష్ (Ashish Reddy) రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం రౌడీ బాయ్స్ (Rowdy Boys). హుషారు ఫేం హర్ష కొనుగంటి (Harsha Konuganti) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న సూపర్ మచ్చి (Super machi)జనవరి 14న విడుదల కానుంది.
#SuperMachi for this Pongal ✨
— BA Raju's Team (@baraju_SuperHit) January 2, 2022
Get Ready for the Ultimate Entertainment in Theatres 💥👌
Worldwide Grand Release on Jan 14,2022 🥁 ☄️#SuperMachiOnJan14 @IamKalyaanDhev @RachitaRamDQ @MusicThaman @creatorkrish @DirPuliVasu @RizwanEntrepre1 @Kushi_FME @adityamusic pic.twitter.com/h9qkSDWkA6