రౌడీ బాయ్స్ (Rowdy Boys) సినిమాతో టాలీవుడ్ (Tollywood) ఎంట్రీ ఇస్తున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు మేనల్లుడు అశిష్ (Ashish Reddy) రెడ్డి. హుషారు ఫేం హర్ష కొనుగంటి (Harsha Konuganti) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ను మేకర్స్ అందించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే తేదీ ఫైనల్ అయింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రౌడీ బాయ్స్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్రాజ్, శిరీష్ నిర్మిస్తుండగా.. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కురపాటి, కోమలి ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Get ready to meet the #RowdyBoys in a theatre near you.
— BA Raju's Team (@baraju_SuperHit) January 2, 2022
IN THEATRES THIS SANKRANTHI #Ashish@anupamahere @HarshaKonuganti @ThisisDSP @Madhie1 @SVC_official @adityamusic#sahidevvikram #karthikrathnam #tejkurapati @komaleeprasad pic.twitter.com/V0rWPYKZRn
సంక్రాంతి బరిలో నిలవాల్సిన భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు లేకపోవడంతో ఇదే సరైన టైం అని భావించిన దిల్ రాజ్ టీం రౌడీబాయ్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. మరి ఆశిష్ రెడ్డి ఎంట్రీకి సంక్రాంతి ఏవిధంగా కలుసొస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.