సినీ పరిశ్రమ (Cinema Industry)లో సుదీర్ఘ కాలం హీరోయిన్గా జర్నీ సాగించాలంటే అంత చిన్న విషయమేమి కాదు. ఓ వైపు అందం, మరోవైపు ఫిట్నెస్ను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. అలాంటి హీరోయిన్ల జాబితాలో లీడింగ్ లో ఉంటుంది ముంబై సుందరి శ్రద్దాదాస్ (Shraddha Das). 2008లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. ఆ తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆర్య 2 చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది.
ఈ భామ ఇండస్ట్రీలో దశాబ్దకాలం దాటినా వన్నె తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. శ్రద్దాదాస్ పోస్ట్ చేసిన స్టిల్స్ కొన్నిఇపుడు నెట్టింట కాక పుట్టిస్తున్నాయి. 2022కు గ్రాండ్‌గా వెల్కమ్ చెబుతూ పార్టీ చేసుకుంది. గోవాలోని ఆక్సిజన్ రిసార్ట్స్ (Oxygen resorts) బికినీ వేర్లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హాట్ హాట్‌గా హొయలు పోతూ శ్రద్దాదాస్ పోస్ట్ చేసిన బికినీ స్టిల్స్ (Shraddha Das bikini Stills) నెటిజన్ల మతులు పోగొడుతున్నాయి.
మరోవైపు ఈ భామ పార్టీ మూడ్‌లో వైట్ టాప్, రెడ్ ట్రౌజర్ లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో నిరీక్షణ, అర్థం, కన్నడలో కోటిగొబ్బ 3 సినిమాల్లో నటిస్తోంది.