అందం, అభినయం ఉన్నా అవకాశాలు మాత్రం అంతగా రాక చాలా నిరాశలో ఉంది శ్రద్ధా దాస్. అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. ఏ సినిమా కూడా శ్రద్ధాకి సరైన బ్రేక్ ఇవ్వలేదు. సంపూర్ణంగా అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్న ఈ ముంబై భామ వచ్చిన అవకాశాలకు సంపూర్ణమైన న్యాయం చేస్తుంది. గుంటూర్ టాకీస్ లాంటి బోల్డ్ పాత్రైనా.. గరుడ వేగ లాంటి కాన్సెప్ట్ సినిమా అయినా శ్రద్ధా మార్క్ ఆ పాత్రలో కనిపించాల్సిందే.
హీరోయిన్ మెటీరియల్ పీస్ అయిన శ్రద్ధాకు ఆఫర్స్ వచ్చినా కూడా అవి కామెడీ ప్రధానం సాగేవో లేదంటే సెకండ్ హీరోయిన్గానో ఉంటున్నాయి. దీంతో శ్రద్ధా అంతగా హైలైట్ కాలేకపోతుంది. అయితే అందరిలానే సోషల్ మీడియాని ఎక్కువగా నమ్ముకున్న శ్రద్ధాదాస్ ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. ఎక్కువగా నడుము అందాలతో ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా బ్లూకలర్ శారీలో శ్రద్ధా ఎంతో హోయలు పోతూ అందాలు ఆరబోసింది. ఆమె ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.