సింగం, సింగం 3, నోటాతోపాటు మరెన్నో హిట్ చిత్రాలను నిర్మించింది ప్రముఖ నిర్మాత సంస్థ స్టూడియో గ్రీన్ (Studio Green). ఈ పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించింది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram)తో నెక్ట్స్ చిత్రాన్ని తీస్తున్నారు స్టూడియో గ్రీన్ మేకర్స్. ఆర్యతో సార్పట్టా పరంపర లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పా రంజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.
విక్రమ్ చివరి సారిగా తెలుగులో వీడింతే సినిమాలో నటించాడు. విక్రమ్ కెరీర్లో ఇది 61వ సినిమా. కాగా కేఈ జ్ఞాన్వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్ర నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు