Vijay Deverakonda | టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), కన్నడ భామ రష్మికమందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్‌పై హిట్ పెయిర్‌గా నిలిచిన ఈ స్టార్ సెలబ్రిటీలు.. ఆఫ్ స్క్రీన్ బాండింగ్ విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారని తెలిసిందే. ఇద్దరు డేటింగ్లో ఉన్నారంటూ ఇప్పటికే నెట్టింట కథనాలు రౌండప్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఇద్దరు మీడియా కంటపడ్డ వీడియో ఒకటి నెట్టింట చర్చకు దారి తీసింది.
విజయ్ దేవరకొండ, రష్మికమందన్నా ఇటీవలే ఓ స్టోర్‌ను సందర్శించారు. అయితే ఈ ఇద్దరూ తమ పని ముగించుకుని స్టోర్‌లో నుంచి బయటకు వచ్చేటప్పుడు క్లిక్ మనిపించిన వీడియో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఇంతకీ వీడియోలో ఏముందనే కదా మీ డౌటు. రష్మిక స్టోర్ లోపలి నుంచి నుంచి హెల్పింగ్ స్టిక్‌తో మెల్లమెల్లగా కారు వైపు వచ్చింది. అయితే పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ మాత్రం రష్మిక మందన్నాకు ఎలాంటి సాయం చేయకుండా డైరెక్టుగా వచ్చి కారులో కూర్చోవడంతో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.
ఈ వీడియో చాలా మంది ఫాలోవర్లకు కోపం తెప్పిస్తోంది. అయితే రష్మికకు సపోర్ట్‌గా మరో వ్యక్తి పక్కనే ఉండటం కూడా వీడియోలో చూడొచ్చు. మరి రష్మికకు సాయంగా ఒకరున్నారు కదా అని విజయ్ దేవరకొండ అలా పట్టించుకోకుండా వచ్చి కారులో కూర్చున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. విషయం ఏదైనా వీడియోను చూసిన వాళ్లు మాత్రం సాయం చేయొచ్చు కదా లైగర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
వీడియోపై లుక్కేయండి మరి..!
#VijayDeverakonda #Rashmika spotted at the gym. pic.twitter.com/bRSkWEtHtg
— Milagro Movies (@MilagroMovies) February 5, 2025
Read Also :
Samuthirakani | ‘ఒక పథకం ప్రకారం’ పట్టుకుంటే రూ.10 వేలు.. సముద్రఖని బంపర్ ఆఫర్
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్