Samuthirakani | టాలీవుడ్ యాక్టర్ సాయి రామ్ శంకర్ (Sairam Shankar) లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ఒక పథకం ప్రకారం (Oka Pathakam Prakaram). వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గార్లపాటి రమేశ్‌తో కలిసి వినోద్ కుమార్ విజయన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తూ అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది.
సాయి రామ్ శంకర్ ఇప్పటికే మా గ్రిప్పింగ్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’ సినిమాను ఫిబ్రవరి 7నుంచి థియేటర్లలో చూడండి. ఇంటర్వెల్ సమయానికి మీరు విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. అంటూ బంఫర్ ఆఫర్ ప్రకటించాడని తెలిసిందే. తాజాగా మరో కీలక పాత్రలో నటిస్తోన్న సముద్రఖని కూడా ఓ వీడియో షేర్ చేశాడు.
ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతుండటం అందరూ వెళ్లి చూడండి. ఆసక్తికర విషయమేంటంటే పట్టుకుంటే రూ.10 వేలు కాంటెస్ట్ పెట్టాం. అదేంటంటే ఇంటర్వెల్ బ్లాక్‌లో మీ అందరికీ ఓ స్లిప్ ఇస్తారు. అందులో విలన్ ఎవరో మీరు రాసిచ్చేయాలి. అది కరెక్ట్‌గా రాస్తే మీరు ఆ గిఫ్ట్ ఇస్తారు. ఒకవేళ పదిమంది కరెక్ట్‌గా రాస్తే లక్కీ డ్రా తీసి పేరొచ్చిన వారికి రూ.10 వేలు ఇస్తారండి.. అంటూ వీడియో షేర్ చేశాడు ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇంకేంటి మరి సినిమా చూసి విలన్ ఎవరో చెప్పేయండి. గిఫ్ట్‌ను గెలుచుకోండి. సాయి రామ్ శంకర్ బోల్డ్ ఛాలెంజ్ స్రీన్‌ప్లే, స్టోరీపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చెప్పకనే చెబుతున్నాయి. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయి రామ్ శంకర్ టీం నయా స్ట్రాటజీ సినిమాకు ఎంతలా కలిసొస్తుందనేది చూడాలి మరి.
🎬 Samuthirakani has extended his heartfelt wishes to the talented team behind *#OkaPathakamPrakaram*! His enthusiasm for the project is infectious, & he also highlighted the thrilling *₹10,000 #OPPchallenge!* 💰🔥
Are you ready to delve into the world of suspense & intrigue?… pic.twitter.com/T4lPcj9HAR
— BA Raju’s Team (@baraju_SuperHit) February 6, 2025
Read Also :
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్